Terms & Conditions

  • Home
  • Terms & Conditions

1. అంతర్జాతీయ పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ ద్వారా పద్మశాలీయులకు సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో శ్రీ భావనాఋషి పరివార్ పేరుతో ఉన్న యాప్ నందు పద్మశాలీయులకు మాత్రమే రిజిస్ట్రేషన్ మరియు సభ్యత్వం ఉన్నందున, నేను పద్మశాలీయుడిని కాబట్టి ఈ యాప్ నందు విధివిధానాలు, నియమనిబంధనలు నాకు నచ్చి నాయిష్ట పూర్వకంగా యాప్ నందు రిజిస్టర్ చేసుకుంటున్నాను.

2 నేను రిజిస్టర్ అయిన తరువాత నా వంతుగా సహాకారం అందిస్తాను, నాకు నచ్చనిచో‌ ట్రస్ట్ కు మరియు ఈ యాప్ కు నా వలన ఏవిధమైన ఇబ్బందులు కలిగించను. స్వచ్చందంగా ఈ యాప్ నందు నా రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొనుటకు శ్రీ భావనాఋషి పరివార్ యాప్ అనుమతి కోరుకుంటాను. ఈ యాప్ నందు రాజ్యాంగ, చట్ట, న్యాయ వ్యవస్థకు విరుద్దమైనవి మరియు అసంఘటిత కార్యకలాపాలను నిర్వహించను. విరుద్దమైన కార్యకలాపాలు సాగించినట్లు రుజువైతే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు నేను బాధ్యత వహిస్తాను.

3 యాప్ నందు పెళ్లి సంబంధాలు కొరకు పరిచయాలు చూపించడం ద్వారా నా యిష్టపూర్వకంగా పెళ్లి సంబంధాలకై ఇతరులు ఇచ్చినటువంటి వివరాలు యాప్ నందు చూసుకొని శ్రీ భావనాఋషి మొబైల్ యాప్ వాళ్ల ప్రమేయం లేకుండా నాకు నచ్చిన సంబంధం యొక్క మంచి చెడులు విచారణ చేసుకుని వివరాలు తెలుసుకొని నా సొంత నిర్ణయంతో సంబంధం కలుపుకుంటాను.

4 నా యిష్ట పూర్వకంగా యాప్ నందు క్లాసిక్ ఫ్లైడ్ మరియు అనేక రకాల సేవలు నా యొక్క అవసరాల నిమిత్తం ఉపయోగించుకొనుటలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా, శ్రీ భావనాఋషి పరివార్ కు మరియు యాప్ కు ఎటువంటి సంబంధం లేకుండా, ఉపయోగించు కుంటాను.

5 భావనాఋషి పరివార్ యాప్ నందు నేను నా అవసరముల నిమిత్తం ఉపయోగించు కొనుటకు భావనాఋషి పరివార్ మొబైల్ యాప్ నడుపుటకు కర్చుల నిమిత్తం వారు నిర్ణయించిన పైకమును చెల్లించి ఉపయోగించుకుంటాను.

6 అంతర్జాతీయ పద్మశాలీ సంక్షేమ ట్రస్టు ద్వారా పద్మశాలీలకు చేసే సహాయ సహకారాలకు నిర్మాణాలకు నా వంతుగా నా ఇష్టపూర్వకంగా విరాళములు అందించగల వాడను.

7 శ్రీ భావనాఋషి పరివార్ ద్వారా పద్మశాలీయులకు సంక్షేమం అభివృద్ధి అందించుటలో నా వంతు కమిటీలో సభ్యులుగా సేవ చేయుటకు అవకాశం కల్పించగలరు.

8 శ్రీ భావనాఋషి పరివార్ యొక్క ఆశయాలు లక్ష్యాల కొరకు చేర్పులు మార్పులుకు, నియమనిబంధనలకు లోబడి ఉంటానని నా మనస్సాక్షిగా తెలుపుతున్నాను.

ఈ విధి విధానం గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి support@sribhavanarushiparivar.com

Phone +91 7286878269