శ్రీ గోలి పట్టాభిషేకం గారు 1890 దశకంలో బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనలో రైతుగా జీవిస్తూ రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. వీరి కుమారుడు శ్రీ గోలి కోటేశ్వరరావు గారు 1917వ దశకంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్ పిలుపునకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. శ్రీ గోలి కోటేశ్వరరావు గారి భార్య బెజవాడలో మహిళా మండలి సభ్యులుగా మహిళల రక్షణ కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. వీరి కుమారుడు శ్రీ గోలి శంకరరావు గారు 1952వ దశకంలో స్వాతంత్ర్యం వచ్చాక హిందూ ధర్మం రక్షణ కోసం ఆర్,ఎస్,ఎస్ లో కరసేవకులుగా ఎన్నో రకాల సేవలు అందించారు. శ్రీ గోలి కోటేశ్వరరావు గారి మరో కుమారుడు శ్రీ గోలి శివకుమార్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో సేవలు అందించారు. భారతియత సేవాతత్పురులు కలిగిన కుటుంబం నుంచి వచ్చాను.
శ్రీ గోలి శంకరరావు శ్రీమతి నాగ మల్లీశ్వరి దంపుల ఏకైక పుత్రుడిగా జన్మించాను నా స్వస్థలం మంగళగిరి లోనే ఎస్ ఎస్ సి పూర్తి చేసి విజయవాడ, 1 టౌన్ లో విశ్వబ్రాహ్మణులైన బ్రహ్మశ్రీ కర్రి సూర్యనారాయణ గురువు గారి వద్ద శిష్యరికం చేసి స్వర్ణకార వృత్తితో పాటు జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవడం జరిగింది. స్వర్ణకార వృత్తితో జీవనం సాగిస్తూ కుటుంబం పోషించసాగాను
1992 నుంచి నాకు 15 ఏళ్ల వయస్సులో హిందువులపై జరిగే దాడులు చూసి నేను చలించి ఆర్ ఎస్ ఎస్ లో చేరాను. దుష్టశక్తులు హిందువులను మతమార్పిడి ఎక్కువగా చేస్తున్నారు ఆ సమయంలో ధర్మజాగరణ సమితిలో పద్మశాలీ కుల పరియోజనలో బాధ్యత తీసుకుని క్రిష్టియన్ మతం మారిన పద్మశాలీయులను తిరిగి పునరాగమనం చేయించేవాళ్ళం.
మతం మారిన వాళ్ళు అందరూ ఆర్థిక ఇబ్బందులతో అవసరాల కోసం మారిన వాళ్ళే కుటుంబం లోని ఒకరికి అనారోగ్యం వల్ల ఖరీదైన వైద్యం కోసం అప్పులు చేసినా తగ్గక పోతే గౌర్నమెంట్ హాస్పటల్ లో ఉన్నవాళ్ళను. ఆర్థిక స్థోమత లేక పై చదువులకు వెళ్ళలేని వాళ్ళను. వ్యాపారంలో నష్టంవచ్చి ఆత్మహత్య ప్రయత్నంలో ఉన్నవారిని టార్గెట్ చేసి వాళ్ళ సంస్థల ద్వారా వారి అవసరాలను తీర్చి మతం మార్చుకుంటున్నారు.
అటువంటి ఇబ్బందులు అవసరాల కోసం మనం అందరం ఐక్యతతో ఉంటే పూర్తి స్థాయిలో సంక్షేమం అభివృద్ధి అందించుకోనవచ్చును కదా అనే ఆలోచనతోనే. శ్రీ భావనాఋషి పరివార్ ఏర్పాటు చేయడం జరిగింది.
పూర్తి స్థాయిలో పద్మశాలీయులకు సంక్షేమం అభివృద్ధి జరగాలంటే పద్మశాలీ కుటుంబ సమగ్ర సర్వే జరిగాలి అందుకే యాప్ రూపొందించడం జరిగింది.
శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శివస్వామీజీ వారి శిష్యరికంలో శ్రీ మార్కండేయ స్వామి ఉపాసన తీసుకుని మార్కండేయమహర్షి స్వామి మాలధారణ దీక్షా విధానం గ్రంథం రచిచడం జరిగింది. పద్మశాలీయుల 101 గోత్రాలలో ఒకొక్క గోత్రికునికి ఒక లింగరూపంలో 101 లింగాలు ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఏకోత్తరశత గోత్రలింగాలయం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నిర్మాణం శ్రీ శైవక్షేత్రంలో జరుగుతున్నాయి.